పెరిగిన ఎరువుల ధరలు తగ్గించాలని ధర్నా
తొర్రూరు టౌన్, ఆంధ్రప్రభ: కేంద్ర ప్రభుత్వం ఇటీవల ఎరువుల ధరలను భారీగా పెంచిందని, వాటిని వెంటనే తగ్గించాలని సిపిఐ (ఎంఎల్) మాస్ లైన్ ఉమ్మడి వరంగల్ జిల్లా కార్యదర్శి కొత్తపల్లి రవి, తొర్రూరు డివిజన్ కార్యదర్శి ముంజంపల్లి వీరన్నలు డిమాండ్ చేశారు. సిపిఐ (ఎంఎల్) రైతు సంఘాల ఆధ్వర్యంలో ఎమ్మార్వో కార్యాలయం ముందు ధర్నా నిర్వహించి తాహసిల్దార్కు వినతిపత్రం అందజేశారు. అనంతరం వారు మాట్లాడుతూ పెరిగిన ఎరువుల ధరలు చిన్న, సన్నకారు రైతులకు తీవ్ర ఆర్థిక భారంగా మారాయని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం వెంటనే ధరలను తగ్గించాలని కోరారు.
