అటవీ ప్లాంటేషన్ మొక్కలను ధ్వంసం..

  • నిందితునికి 14 రోజుల రిమాండ్

ఉట్నూర్, ఆంధ్రప్రభ: ఆదిలాబాద్ జిల్లా ఉట్నూరులో అటవీశాఖ ప్లాంటేషన్లో రెండు వేల 500 మొక్కలను ధ్వంసం చేసిన కన్నాపూర్ గ్రామానికి చెందిన నైతం రాముపై కేసు నమోదు చేసి సోమవారం కోర్టుకు పంపించగా ఉట్నూర్ కోర్టు న్యాయమూర్తి 14 రోజుల రిమాండ్ కు పంపినట్లు ఎఫ్ఆర్ఓఇర్ల అరుణ తెలిపారు. అటవీశాఖ నాటిన మొక్కలకు డ్యామేజ్ చేసిన రాముపై ఎఫ్డిఓ బొజ్జి రావు పాటిల్ ఎఫ్డిఓకే అరవింద్ ఆదేశాల మేరకు అతనిపై కేసు నమోదు చేయడం జరిగిందని, నిందితుడు రాములు కోర్టుకు రిమాండ్ పంపగా ఉట్నూర్ కోర్టు జడ్జి రాముకు 14 రోజులు జై lలుకు రిమాండ్ చేసిందని ఆమె తెలిపారు. కోర్టుకు హాజరైన వారిలో డిప్యూటీఆర్ఓ సీతారాం ఎఫ్ బి ఓ లు రాజకుమార్ మహిపాల్, బలవంత్, పాల్గొన్నారని ఎఫ్ ఆర్ ఓ అరుణ తెలిపారు.