RIGISTRATION | రిజిస్ట్రేషన్ ప్రక్రియ సజావుగా సాగాలి
సబ్ రిజిస్టర్ కార్యాలయాన్ని సందర్శించిన జిల్లా రిజిస్టార్ ప్రవీణ్ కుమార్
RIGISTRATION |కరీమాబాద్, ఆంధ్రప్రభ : వరంగల్ నగరంలోని ఉర్సు గుట్ట వద్ద ఖిలా వరంగల్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాన్ని జిల్లా రిజిస్టర్ ప్రవీణ్ కుమార్ శనివారం మధ్యాహ్నం సందర్శించారు. ఈ సందర్భంగా కార్యాలయంలో జరుగుతున్న ఆస్తుల రిజిస్ట్రేషన్, స్టాంప్ డ్యూటీ వసూలు, రికార్డుల నిర్వహణ సక్రమంగా ఉన్నాయా లేదా అని పరిశీలించారు. సిబ్బంది పనితీరును అడిగి తెలుసుకున్నారు. రిజిస్ట్రేషన్ పత్రాల ఆన్లైన్ ప్రక్రియను పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. రిజిస్ట్రేషన్ కోసం స్లాట్ బుక్ చేసుకున్నవారికి ఇబ్బందులు కలుగకుండా రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తి చేయాలన్నారు. ఎప్పటికప్పుడు రికార్డులను ఆన్లైన్ చేయాలని సూచించారు. సాధారణ తనిఖీలలో భాగంగానే ఖిలా వరంగల్ రిజిస్ట్రేషన్ కార్యాలయాన్ని సందర్శించినట్లు డీఆర్ ప్రవీణ్ కుమార్ పేర్కొన్నారు. కార్యక్రమంలో ఇన్చార్జ్ సబ్ రిజిస్టర్ వెంకట్ లాల్, కార్యాలయ సిబ్బంది ఉన్నారు.
