తహసీల్దార్ కార్యాలయంలో తృటిలో తప్పిన ప్రమాదం

తహసీల్దార్ కార్యాలయంలో తృటిలో తప్పిన ప్రమాదం

-పరుగులు తీసిన అధికారులు ప్రజలు

ఊట్కూర్, ఆంధ్రప్రభ: నారాయణపేటజిల్లా ఊట్కూర్ తహసీల్దార్ కార్యాలయం గేటు ముందు ఉన్న పైకప్పు పెచ్చులూడి కింద పడడంతో సోమవారం తృటిలో ప్రమాదం తప్పింది. దీంతో అధికారులు ,ప్రజలు పరుగులు తీశారు. ఊట్కూర్ తహసీల్దార్ కార్యాలయానికి వివిధ పనుల నిమిత్తం ప్రతినిత్యం వందలాది సంఖ్యలో ప్రజలు వస్తుంటారు. కార్యాలయంలోని వివిధ గదుల పై కప్పులు పెచ్చులూడి ప్రమాదకరంగా ఉన్నాయి. గతంలో పైకప్పు పెచ్చులూడి గాయాలైన సంఘటనలు ఉన్న జిల్లా అధికారులు పట్టించుకోవడం లేదని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇప్పటికైనా సంబంధిత అధికారులు వెంటనే స్పందించి తహసీల్దార్ కార్యాలయ పైకప్పు మరమ్మతు చేపట్టాలని పలువురు కోరుతున్నారు. ఈ సంఘటనపై తహసీల్దార్ చింత రవి నీ వివరణ కోరగా పైకప్పు పెచ్చులూడి ప్రమాదకరంగా ఉన్న విషయం ఉన్నతాధికారులకు నివేదించినట్లు తెలిపారు.

Leave a Reply