హైదరాబాద్, ఆంధ్రప్రభ : బీజేవైఎం నాయకులు అసెంబ్లీ ముట్టడికి ప్రయత్నించడంతో ఉద్రిక్తత నెలకొంది. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ కి సంబంధించిన భూములను వేలానికి ఇటీవల తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. ఈ నిర్ణయాన్ని యూనివర్సిటీ విద్యార్థి సంఘాలతో పాటు ఇతర పార్టీ నేతలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఈ క్రమంలోనే యూనివర్సిటీ భూముల వేలం నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ తో మంగళవారం బీజేవైఎమ్ నేతలు అసెంబ్లీ ముట్టడికి ప్రయత్నించారు. ఈ క్రమంలో పోలీసులు వారిని అడ్డుకోవడంతో ఒక్కసారిగా అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. అయితే బీజేవైఎమ్ నేతల నిరసన కి మద్దతుగా నిలిచిన బీజేపీ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి ని పోలీసులు అరెస్ట్ చేశారు. బీజేవైఎం నేతలను అరెస్టు చేసిన పోలీసులు వారికి అక్కడి నుంచి స్థానిక పోలీస్ స్టేషన్‌కు తరలించారు.
TG | అసెంబ్లీ ముట్టడికి బీజేవైఎం యత్నం
