రాష్ట్ర స్థాయి అథ్లెటిక్స్‌కు నల్లమల విద్యార్థిని ఎంపిక

రాష్ట్ర స్థాయి అథ్లెటిక్స్‌కు నల్లమల విద్యార్థిని ఎంపిక
అచ్చంపేట, ఆంధ్రప్రభ: నాగర్ కర్నూల్ జిల్లా, పదర మండల కేంద్రానికి చెందిన ఎడ్మ లక్కీయాదవ్ రాష్ట్ర స్థాయి సబ్‌జూనియర్ అథ్లెటిక్స్ పోటీలకు ఎంపికయ్యింది. ఈ నెల 26న అచ్చంపేట పట్టణంలోని స్థానిక సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల/కళాశాలలో నిర్వహించిన జిల్లా స్థాయి పోటీలలో 300 మీటర్ల పరుగుపందెంలో ప్రతిభ కనబరిచి ఈ అవకాశాన్ని దక్కించుకుంది. రాబోయే నెల 17న మేడ్చల్ జిల్లా కొల్లూరులో జరగనున్న రాష్ట్ర స్థాయి పోటీలలో లక్కీయాదవ్ పాల్గొననుందని ఆమె తల్లిదండ్రులు ఎడ్మ శ్రీను యాదవ్, సరిత తెలిపారు. ప్రస్తుతం ఆమె అమ్రాబాద్ ప్రోగ్రెసివ్ పాఠశాలలో విద్యనభ్యసిస్తోంది. లక్కీయాదవ్ సాధించిన విజయంపై గ్రామస్తులు, కుటుంబ సభ్యులు, సీనియర్ క్రీడాకారులు, ప్రిన్సిపల్ అంబికా, ఉపాధ్యాయులు, స్థానిక నాయకులు హర్షం వ్యక్తం చేశారు. రాష్ట్ర స్థాయిలో కూడా మెరుగైన ప్రతిభ కనబరచి పతకాలు సాధించాలని ఆకాంక్షించారు.
