జొన్న చేను అగ్నికి ఆహుతి

జొన్న చేను అగ్నికి ఆహుతి

– రూ.2 లక్షల పంట నష్టం – రైతు ఆవేదన

గుడిహత్నూర్, ఆంధ్రప్రభ: మండల కేంద్రంలో స్థానిక రైతుకు చెందిన జొన్న చేను అగ్నికి ఆహుతైంది. ఈ ఘటనలో దాదాపు రూ.2 లక్షల మేర పంట నష్టం జరిగినట్లు బాధిత రైతు రవి నాయక్ తెలిపారు. తెలియజేసిన వివరాల ప్రకారం, అనుకోకుండా చేనులో మంటలు చెలరేగి వేగంగా వ్యాపించాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటన స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. ఈ ఘటనతో రైతు తీవ్ర నష్టపోయాడు. ప్రభుత్వం తక్షణమే పరిహారం అందించి ఆదుకోవాలని స్థానికులు కోరుతున్నారు.

Leave a Reply