పండ్ల మొక్కలకు నిప్పంటించిన గుర్తుతెలియని వ్యక్తులు

పండ్ల మొక్కలకు నిప్పంటించిన గుర్తుతెలియని వ్యక్తులు
ఊట్కూర్, ఆంధ్రప్రభ: వ్యవసాయ పొలంలో బోరుబావి కింద నిమ్మ, జామ, కొబ్బరి పండ్ల మొక్కల తోటలో రైతు సాగు చేసిన మొక్కలను గుర్తు తెలియని వ్యక్తులు సోమవారం నిప్పంటించడంతో సుమారు, రూ.20వేల నష్టం జరిగిన సంఘటన నారాయణపేట జిల్లా ఊట్కూర్ మండల పరిధిలోని పెద్దపోర్ల గ్రామంలో చోటుచేసుకుంది. గ్రామస్తులు బాధిత రైతు కథనం ప్రకారం… ఊట్కూర్ మండల పరిధిలోనిపెద్దపోర్ల గ్రామానికి చెందిన కటికే బాలేపీర్ అనే రైతు తన పొలంలో జామ, నిమ్మ, కొబ్బెర పండ్ల మొక్కల తోట సాగు చేశారు.
సోమవారం గుర్తుతెలియని వ్యక్తులు మొక్కలకు నిప్పు పెట్టడంతో సుమారురూ.20వేల ఆస్తి నష్టం జరిగిందని తెలిపారు. ఈ సంఘటనపై గ్రామపంచాయతీ కార్యదర్శి రాఖీ దృష్టికి తీసుకెళ్లగా దగ్ధమైన పండ్ల మొక్కలనుపరిశీలించారు. ఈ సంఘటనపై రెవెన్యూ పోలీస్ శాఖ అధికారులకు సమాచారం అందించినట్లు తెలిపారు. విషయం తెలుసుకున్న సర్పంచ్ కాశమ్మ, మాజీ బూత్ అధ్యక్షులు బోయిన్ పల్లి నరేష్ కుమార్ రైతు పండ్ల తోటను పరిశీలించి పరామర్శించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పండ్ల మొక్కలు నష్టపోయిన రైతును ప్రభుత్వం ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు.
