మున్సిపల్, మార్కెట్ చైర్మన్లకు ఘన సన్మానం

మున్సిపల్, మార్కెట్ చైర్మన్లకు ఘన సన్మానం
తొర్రూరు టౌన్, ఆంధ్రప్రభః పట్టణంలోని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విశ్రాంతి ఉద్యోగుల భవనంలో సోమవారం మున్సిపల్ చైర్మన్ తూనం శ్రవణ్ కుమార్, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ అనుమాండ్ల తిరుపతి రెడ్డిలను విశ్రాంతి ఉద్యోగుల సంఘం ప్రతినిధులు ఘనంగా సన్మానించారు.
ఈ సందర్భంగా సంఘం సభ్యులు తమ ఎదుర్కొంటున్న పలు సమస్యలను చైర్మన్ల దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై మున్సిపల్ చైర్మన్ శ్రవణ్ కుమార్ సానుకూలంగా స్పందిస్తూ.. విశ్రాంతి ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి తన వంతు సహకారం ఎల్లప్పుడూ ఉంటుందని హామీ ఇచ్చారు. మున్సిపాలిటీ తరఫునే కాకుండా, వ్యక్తిగతంగా కూడా అండగా నిలుస్తానని ఆయన భరోసా కల్పించారు. సమాజంలో విశ్రాంతి ఉద్యోగుల సంక్షేమం మరియు వారి గౌరవాన్ని కాపాడటం ప్రతి ఒక్కరి బాధ్యత అని ఆయన పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో తొర్రూరు మున్సిపల్ కమిషనర్ శ్యాంసుందర్, వైస్ చైర్‌పర్సన్ సొమ రజిని రాజశేఖర్, స్థానిక వార్డు కౌన్సిలర్ మాడుగుల భవాని లత, విశ్రాంతి ఉద్యోగుల సంఘం కార్యవర్గ సభ్యులు మరియు తదితరులు పాల్గొన్నారు.
