గ్రామాల్లో పారిశుద్ధ్య లోపాలు ఉండకూడదు, అదనపు కలెక్టర్.
గ్రామాల్లో పారిశుద్ధ్య లోపాలు ఉండకూడదు, అదనపు కలెక్టర్.
ఇందిరమ్మ ఇళ్లను పరిశీలించి న అదనపు కలెక్టర్ చంద్రయ్య.
దండేపల్లి,ఏప్రిల్ 25(ఆంధ్రప్రభ): ఇందిరమ్మ ఇళ్లను తొందరగా పూర్తి చేసుకోవాలని, గ్రామాల్లో పారిశుద్ధ్య లోపాలు ఉండకూడాదని మంచిర్యాల జిల్లా అదనపు కలెక్టర్ పి చంద్రయ్య అన్నారు, ప్రజా పాలనలో భాగంగా దండేపల్లి మండలం, ధర్మారావుపేట గ్రామ పంచాయతీని సందర్శించారు. ఈ సందర్భంగా అక్కడ కొనసాగుతున్న పారిశుధ్య పనులు, నర్సరీ, నిర్మాణంలో ఉన్న ఇందిరమ్మ ఇళ్ళు, సెగ్రిగేషన్ షెడ్ మొదలైనవాటిని తనిఖీలు నిర్వహించారు, ఈ సందర్భంగా గ్రామస్తులతో మాట్లాడుతూ గ్రామంలో పీఎం అజయ్ పథకం కింద ప్రతిపాదించిన సీసీ డ్రెయిన్లు, సీసీ కల్వర్టులు, తాగునీటి పైప్‌లైన్‌ల వంటి వివిధ అభివృద్ధి ప్రతిపాదనల కోసం కేటాయించిన ప్రదేశాలను పరిశీలించారు.
ముందుగా దండేపల్లి మండలంలోని ముత్యంపేట,చెల్కగుడా, గ్రామ పంచాయతీ లో జరుగుతున్న ఉపాధి హామీ పనులను పరిశీలించారు, ఈ సందర్భంగా ఉపాధి హామీ కూలీలతో మాట్లాడుతూ,
గ్రామాలలో ఉన్న సమస్యలు వడ్ల కొనుగోలు,మంచి నీటి సరఫరా, కొత్త పింఛన్లు, రేషన్ బియ్యం, మురికి కాలువల గురించి అడిగి తెలుసుకున్నారు, ఈ
కార్యక్రమంలో డిపిఓ వెంకటేశ్వర్లు, మండల ప్రత్యేక అధికారి దుర్గా ప్రసాద్, డిఎల్పీఓ ధర్మారాణి,ఎంపిడిఓ జె ఆర్ ప్రసాద్ ,ఎంపిఓ ప్రసాద్,లక్షెటిపేట మార్కెట్ కమిటీ చైర్మన్ దాసరి ప్రేమ్ చందు, గ్రామ సర్పంచ్ లు కుడిమెత తిరుపతి, కొత్త ధర్మయ్య, ఉప సర్పంచ్ ఎండి ఫయాజ్, ఏపీఓ దుర్గా దాస్, పంచాయతీ కార్యదర్శులు,టి ఏ అరవింద్ ఫీల్డ్ అసిస్టెంట్ సతీష్ తదితరులు పాల్గొన్నారు.
