ఫిర్యాదు దారులకు సత్వర న్యాయం అందించాలి..

మంచిర్యాల, ఆంధ్రప్రభ : ఫిర్యాదుదారులకు సత్వర న్యాయం అందించాలి అని మంచిర్యాల డిప్యూటీ పోలీస్ కమిషనర్ (డిసిపీ )ఏ.భాస్కర్ అన్నారు.మంగళవారం నస్పూర్ సిసిసి పోలీస్ స్టేషన్ లొ ఆకస్మిక తనిఖీలు నిర్వహించరు ఈ సందర్భంగా సి ఐ.రవీందర్ డీసీపీకి మొక్కను గౌరవప్రదంగా అందజేశారు.అనంతరం డీసీపీ మాట్లాడుతూ.పోలీసులు బాధితులలో నమ్మకం కల్పించాలి అని గతంలో పోలీస్ స్టేషన్ అంటే భయపడే రోజులు పోయవని ప్రజా ప్రభుత్వంలో పోలీస్ అంటే బాధితులలో మనో ధైర్యాన్ని కల్పించే విధంగా వ్యవహరించాలని అన్నారు.

పోలీస్ స్టేషన్ పరిసర ప్రాంతాలలో రిసెప్షన్,సిసిటి ఎన్ ఎస్,ఇతర పోలీస్ సిబ్బందిని విధులు ఎలా నిర్వహిస్తున్నారు అంటూ సమాచారం అడిగి తెలుసుకున్నారు.స్టేషన్ నిర్వహణ సంబంధించిన రికార్డులు రౌడీషీటర్లు అనుమానితుల వివరాలు ప్రస్తుతం పెండింగ్లో ఉన్న కేసుల రికార్డులను తనిఖీ చేసి పెండింగ్ లో ఉన్న వాటి వివరాలను పరిశీలించారు. పెట్రోలింగ్ వాహనాలతో తనిఖీలు నిర్వహిస్తూ విజిబుల్ పోలిసింగ్ చేపట్టాలని సూచించారు.

ప్రతి కానిస్టేబుల్ కు కేటాయించిన కాలనీలను,గ్రామాలను సందర్శించి ప్రజలు యువతతో మాట్లాడి.శాంతి భద్రతలకు సంబంధించిన సమస్యలను తెలుసుకోవాలని ప్రతి ఒక్క ఏరియాలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకునేలా అవగాహన కార్యక్రమాలు చేపట్టాలన్నారు. సైబర్ నేరాల పట్ల ప్రజలకు అప్రమత్తం చేయాలని ట్రాఫిక్ నిబంధన పై అవగాహన పెంచి ప్రతి ఒక్కరు తప్పనిసరిగా ట్రాఫిక్ రూల్స్ పాటించే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు.

రోడ్డు ప్రమాదాల నివారణకు ముందస్తు చర్యలు తీసుకోవాలని చట్ట వ్యతిరేక కార్యక్రమాలపై ప్రత్యేక నిఘా ఉంచాలన్నారు. కళాశాలలు పాఠశాలల పరిసరాల్లో పొగాకు ఉత్పత్తుల విక్రయాలకు పాల్పడే వారిపై చట్ట ప్రకారం కఠినంగా వ్యవహరించాలని అన్నారు.స్థానిక ఎస్ఐ ప్రశాంత్ పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.

Leave a Reply