లారీ, కారు ఢీ… ఐదుగురికి తీవ్ర గాయాలు

లారీ, కారు డీ…ఐదుగురికి తీవ్ర గాయాలు

  • శుభకార్యానికి వెళ్లి వస్తుండగా ప్రమాదం

బోనకల్, ఆంధ్రప్రభ : ఖమ్మం జిల్లా బోనకల్ మండల ఫరిధిలో…బోనకల్ – జగ్గయ్యపేట ప్రధాన రహదారిలో బోనకల్ బ్రాంచ్ కెనాల్ వద్ద శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఐదుగురుకి తీవ్ర గాయాలయ్యాయి. వివరాల్లోకి వెళితే ఏపీలోని గుంటూరుకు చెందిన గరికపాటి నవీన్, విజయ దంపతులతో పాటు నెమలికంటి దాసు, అశోక్, సుబాకర్ లు ఖమ్మంలోని ఓ పంక్షన్ హాల్ లో జరిగిన శుభాకార్యానికి ఇన్నోవా కారులో వచ్చారు.

తిరుగు ప్రయాణంలో బోనకల్ బ్రాంచ్ కెనాల్ వద్ద ముందు వెళ్తున్న వాహనాన్ని ఓవర్ టేక్ చేసే ప్రయత్నంలో ఎదురుగా వస్తున్న లారీని డీ కొట్టింది. ఈ సంఘటనలో ఐదుగురికి తీవ్ర గాయలయ్యాయి. వీరికి స్థానిక పి హెచ్ సీ లో ప్రథమ చికిత్స అందించారు. పి హెచ్ సి వద్దకు చేరుకున్న మధిర సిఐ డి. మధు క్షతగాత్రుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. 108 వాహనాల ద్వార గాయపడ్డ వారిని ఖమ్మం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఈ సంఘటన పై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు.

Leave a Reply