ప్రజాస్వామ్యానికి గ్రామ పంచాయతీ పునాది వంటిది

ప్రజాస్వామ్యానికి గ్రామ పంచాయతీ పునాది వంటిది
కమ్మర్ పల్లి, ఆంధ్ర ప్రభ: కమ్మర్ పల్లి మండలం ఉప్లూర్ గ్రామంలో జాతీయ పంచాయతీ రాజ్ దినోత్సవం సందర్భంగా గ్రామ పంచాయతీ కార్యాలయంలో ప్రత్యేక సమావేశాన్ని శుక్రవారం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా గ్రామా సర్పంచ్ ఏనుగందుల శైలేందర్ మాట్లాడుతూ… గ్రామ ప్రజలకు జాతీయ పంచాయతీ రాజ్ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.
అలాగే గ్రామలే దేశానికి పట్టుకొమ్మలని, ప్రజాస్వామ్యానికి గ్రామ పంచాయతీ పునాది వంటిదని, ఈ వ్యవస్థ బలంగా ఉన్నపుడే దేశం సుభిక్షంగా ఉంటుందని తెలిపారు. అనంతరం గ్రామ అభివృద్ధి కోసం అందరం కలిసి కట్టుగా కృషి చేయాల్సిన అవసరం ఉందన్నారు. అలాగే గ్రామాభివృద్ధి కోసం సలహాలు, సూచనలు చేస్తూ అందరం కలిసి గ్రామాన్ని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకువెళ్ళాల్సిన బాధ్యత మన గ్రామ ప్రజాలందరిపై ఉందని తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ ఉప సర్పంచ్ తక్కురి శేఖర్, కార్యదర్శి నవీన్ గౌడ్, వార్డ్ సభ్యులు అజయ్, అనిల్, సంతోష్ సురేష్ ,సదుల్లా, అంజిత్, సతీష్, విఓఏ లు, అంగన్వాడీ టీచర్స్, ఆశ వర్కర్లు తదితరులు పాల్గొన్నారు.
