రోడ్డు భద్రతా నియమాలు పాటించాలి

రోడ్డు భద్రతా నియమాలు పాటించాలి
ఎస్సై ఉపేందర్
తొర్రూరు టౌను,ఆంధ్రప్రభ : ప్రతి వాహనదారుడు రోడ్డు భద్రత నియమాలు పాటించాలని స్థానిక ఎస్సై కోరారు మంగళవారం భారతరత్న డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ పురస్కరించుకుని విగ్రహానికి టిపిసిసి వైస్ ప్రెసిడెంట్ రాజేందర్ రెడ్డి తదితరులు పూలమాలలు సమర్పించి పుష్పాంజలి ఘటించారు. అనంతరం స్థానిక ప్రజలను ఉద్దేశించి ఎస్.ఐ జి ఉపేందర్ మాట్లాడుతూ పోలీస్ శాఖ ఆధ్వర్యంలో అర్రైవ్ అలైవ్ కార్యక్రమాన్ని మూడో ఫీజు నిర్వహించడం జరుగుతుందని ఇందులో భాగంగా ప్రతి గ్రామంలో హెల్మెట్ ధరించి ప్రయాణించాలని సూచించడంతో కొన్ని గ్రామాల్లో హెల్మెట్ లేని వారు గ్రామాలలో ప్రవేశించ రాదని నిర్ణయం తీసుకొని కఠినంగా అమలు చేస్తున్నారని అన్నారు. ఈ సందర్భంగా ఎస్సై జోకేందర్ వాహనాలు నడిపేటప్పుడు తప్పనిసరిగా హెల్మెట్ ధరిస్తామని దైవ సాక్షిగా జయంతి రోజున ప్రతిజ్ఞ చేయించారు హెల్మెట్ ధరించి ప్రయాణించడంతో అకస్మాత్తుగా ప్రమాదం సంభవిస్తే ప్రాణమా పరిస్థితి నుండి రక్షించుకోవచ్చని చెప్పారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ తులం శ్రవణ్ కుమార్ వైస్ చైర్మన్ సోమ రజిని రాజశేఖర్, కౌన్సిలర్లు మీద వర్గాల ప్రజలు పాల్గొన్నారు
