నిరుద్యోగ యువతకు చక్కటి అవకాశం..
- జాబ్ మేళా ను సద్వినియోగం చేసుకోండి..
- విజయవాడ ఎంపీ కేసీనేని చిన్ని..
- జాబ్ మేళా పోస్టర్ ను లాంచ్ చేసిన ఎంపీ చిన్ని..
- పూర్తి సహకారం అందిస్తున్న ఏపీ స్కిల్ డెవలప్మెంట్…
ఆంధ్రప్రభ, విజయవాడ : నిరుద్యోగ యువతకు జాబ్ మేళాలు చక్కటి అవకాశాలు అందిస్తాయని విజయవాడ పార్లమెంటు సభ్యుడు కేశినేని శివనాద్ పేర్కొన్నారు. విజయవాడ గురునానక్ కాలనీలోని ఎంపీ కార్యాలయంలో బిఎన్ఐ విజయవాడ సభ్యుడు విజయవాడ పార్లమెంట్ సభ్యులు కేశినేని చిన్నితో మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు.
ఈ భేటీలో బిఎన్ఐ విజయవాడ పది సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా జాబ్ మేళాను ఏపీ స్కిల్ డెవలప్మెంట్ సహకారంతో జాబ్ మేళాను నిర్వహిస్తున్నట్లు తెలియజేశారు. జులై 12 ఉదయం ఎనిమిది గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు సిద్ధార్థ కాలేజ్ మొగల్రాజపురంలో ఈ జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
ఈ సందర్భంగా ఎంపీ చిన్ని బిఎన్ఐ జాబ్ మేళా పోస్టర్ను లాంచ్ చేశారు. ఈ సందర్భంగా ఎంపీ కేశినేని చిన్ని మాట్లాడుతూ.. స్కిల్ డెవలప్మెంట్ సహకారంతో ఇంత పెద్ద జాబ్ మేళా విజయవాడలో జరగడం గొప్ప విషయం అని తెలియజేశారు. ఈ జాబ్ మేళాలో దాదాపు 100కు పైగా ప్రముఖమైన కంపెనీలు అనేక రకాల పరిశ్రమలు నేరుగా ఈ జాబ్ మేళాలో పాల్గొని నిరుద్యోగుల అందరిని నేరుగా రిక్రూట్ చేసుకోవడం శుభ పరిణామం అని తెలియజేశారు. యువత అందరూ ఈ జాబ్ మేళాను ఉపయోగించుకొని వారి వారి విద్యార్హతను బట్టి ప్రతి ఒక్కరు ఈ జాబ్ మేళాలో పాల్గొనాలని తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో బిఎన్ఐ సభ్యులు జైహెచ్ దేశాయ్, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్, విశాల్ హెచ్ దేశాయ్, కో-ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్, శ్రీనివాస్ సీపాన, జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి కిరణ్ బొబ్బిలి, జిల్లా సిఆర్ఓ మేఘనా ఆచంట, ఛైర్మన్-జాబ్ మేళా, భరత్ సూరపనేని, సెక్రటరీ-జాబ్ మేళా తదితరులు పాల్గొన్నారు.
