​​ఖమ్మంలో ‘ఐసీఏఐ’ శాఖ ప్రారంభం

ఖమ్మంలో ‘ఐసీఏఐ’ శాఖ ప్రారంభం

ఘనంగా నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారం

​ఖమ్మం, ​ఆంధ్రప్రభ : దేశవ్యాప్తంగా అకౌంటింగ్ రంగంలో అత్యున్నత ప్రమాణాలు నెలకొల్పే ‘ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా’ (ICAI) తన నూతన శాఖను ఖమ్మం జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసింది. ఈ సందర్భంగా 2026-27 సంవత్సరానికి నూతనంగా ఎన్నికైన మేనేజింగ్ కమిటీ ప్రమాణ స్వీకార మహోత్సవం ఆదివారం ఖమ్మం గొరిల్లా పార్క్ ఫంక్షన్ హాల్ లో అత్యంత వైభవంగా జరిగింది. ఖమ్మం శాఖ ప్రథమ చైర్మన్‌గా సీఏ కె. శివ రామకృష్ణ ప్రసాద్‌ బాధ్యతలు స్వీకరించారు.

ఇతర కార్యవర్గ సభ్యులుగా…

​వైస్ చైర్మన్: సీఏ పి. మంద కృష్ణ
​సెక్రటరీ (కార్యదర్శి): సీఏ పి. మురళీ కృష్ణ ప్రసాద్‌
​ట్రెజరర్ (కోశాధికారి): సీఏ ఎం.ఎన్.ఎస్. కార్తీక్ రెడ్డి
​సికాసా (SICASA) చైర్మన్: సీఏ ఇ. లక్ష్మి తేజస్వి
​సభ్యులు : సీఏ ఎస్.వి. సందీప్ బాధ్యతలు చేపట్టారు.

ఈ కార్యక్రమానికి ఎస్‌ఐఆర్‌సీ (SIRC) చైర్మన్ సీఏ సుబ్బారావు ముప్పాళ ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఆయన మాట్లాడుతూ ఖమ్మంలో ఐసీఏఐ శాఖ ఏర్పాటు కావడం ఇక్కడి చార్టర్డ్ అకౌంటెంట్లకు, విద్యార్థులకు వరం లాంటిదని పేర్కొన్నారు. సెంట్రల్ కౌన్సిల్ సభ్యులు సీఏ శ్రీధర్ ముప్పాళ మాట్లాడుతూ వృత్తిపరమైన నైపుణ్యాలను పెంపొందించుకోవడంలో ఈ శాఖ కీలక పాత్ర పోషిస్తుందని తెలిపారు. ఎస్‌ఐఆర్‌సీ వైస్ చైర్మన్ సీఏ సునీల్ కుమార్ మండవ, ఎస్‌ఐఆర్‌సీ సభ్యులు సీఏ భాను నారాయణ రావు వై.వి., , యర్రా తిరుపతయ్య ప్రత్యేక అతిథులుగా పాల్గొని నూతన కమిటీకి దిశానిర్దేశం చేశారు.

​భారీగా తరలివచ్చిన సీఏలు:

ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ఖమ్మం పట్టణంతో పాటు కొత్తగూడెం, మిర్యాలగూడెం, సూర్యాపేట ప్రాంతాలకు చెందిన చార్టర్డ్ అకౌంటెంట్లు భారీగా తరలివచ్చారు. స్థానిక సీఏ విద్యార్థులకు మెరుగైన శిక్షణ , వనరులు కల్పించడమే తమ ప్రాథమిక లక్ష్యమని నూతన చైర్మన్ సీఏ శివ రామకృష్ణ ప్రసాద్‌ ఈ సందర్భంగా ప్రకటించారు.