వడదెబ్బకు మహిళ మృతి..

వడదెబ్బకు మహిళ మృతి..

చిలుపూర్, ఆంధ్రప్రభ : చిలుపూర్ మండలం ఫత్తేపూర్ గ్రామ పరిధిలోని నునావత్ తండాకు చెందిన నూనావత్ బుజ్జమ్మ 55 వడదెబ్బకు గురై బుధవారం మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. స్టేషన్ ఘన్ పూర్ కు బ్యాంకు పనినిమిత్తం మంగళవారం బుజ్జమ్మ వెళ్ళారు. సాయంత్రం ఎండలోనే ఇంటికి చేరుకోగా వడదెబ్బకు గురయింది. తెలిపారు. చికిత్స కోసం ఆసుపత్రికి తీసుకెళ్తుండగా మార్గమధ్యం లోనే మరణించినట్లు తెలిపారు. మృతురాలికి భర్త ముగ్గురు పిల్లలు ఉన్నారు.

Leave a Reply