ప్రజాబాటతో విద్యుత్ సమస్యల పరిష్కారం

స్టేషన్ ఘన్‌పూర్, ఆంధ్రప్రభ : స్టేషన్ ఘన్‌పూర్ మున్సిపాలిటీ పరిధిలోని ఛాగల్ గ్రామ శివారులోని కమ్మరి పేట శనివారం నిర్వహించిన ప్రజాబాట కార్యక్రమంలో ఎన్పిడిసీ ఎల్ ఘన్ పూర్ టౌన్ ఏఈ పగిడిముంతల శంకర్ పాల్గొన్నారు. ఉన్నతా ధికారుల ఆదేశాల మేరకు వారానికి మూడు రోజుల పాటు ప్రజాబాట కార్యక్రమం నిర్వహిస్తూ గ్రామాల్లోని విద్యుత్ సమస్యలను తెలుసుకుని పరిష్కరిస్తున్నామని ఆయన తెలిపారు. ఈ సందర్భంగా గ్రామస్థులు ఎదుర్కొంటున్న విద్యుత్ సరఫరా సమస్యలను ఏఈ శంకర్ ప్రత్యక్షంగా విని వాటిని త్వరితగతిన పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.

వివిధ ప్రాంతాల్లో వదులుగా ఉన్న విద్యుత్ తీగలను గుర్తించి మధ్యస్థ స్థంబా లు ఏర్పాటు చేయడం, వంగిపోయిన మరియు పాత స్థంబాలను మార్పు చేయడం వంటి చర్యలు చేపడతామని చెప్పారు. వినియోగ దారులు విద్యుత్ సరఫరాలో ఎలాంటి సమస్యలు ఉన్నా వెంటనే తమ దృష్టికి తీసుకురావాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సీనియర్ లైన్ ఇన్ స్పెక్టర్ ఎల్. రామాచారి, లైన్ మెన్ అనుమాండ్ల యుగేందర్, రైతు లు ముప్పిడి నర్సయ్య, కుమారి, రాములు, శ్రీనివాస్, యాదగిరి, ఎల్ల య్య, కొమురల్లి, రేకులపల్లి నాగరాజు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply