పోలేరమ్మకు మొక్కులు తీర్చుకున్న మాదాసికుర్వలు

పోలేరమ్మకు మొక్కులు తీర్చుకున్న మాదాసికుర్వలు

ఊట్కూర్, ఆంధ్రప్రభ: నారాయణపేట జిల్లా ఊట్కూర్ మండల పరిధిలోని ఓబులాపూర్ గ్రామంలో మాదాసి కుర్వ సంఘం మక్తల్ తాలూకా అధ్యక్షులు అంజప్ప ఆధ్వర్యంలో మంగళవారం పోలేరమ్మ జాతర వేడుకలు ఘనంగా నిర్వహించారు. గొర్రెలు మేకలు పెంచుకొని జీవనం కొనసాగిస్తున్న మాదాసి కుర్వ కులస్తులు ప్రతి ఏడాది వర్షాకాలం ఆరంభంలో రోహిణి కార్తిలో గ్రామ దేవతలకు మొక్కులు చెల్లించుకోవడం ఆనవాయితీ. గొర్రెలు మేకలకు వర్షాకాలం ఎలాంటి వ్యాధులు ప్రబలకుండా గ్రామ దేవతలకు మొక్కలు చెల్లించుకుంటారు.

మంగళవారం సామూహికంగా తలపై బోనాలతో డప్పు మేళతాళాల మధ్య భారీ ఊరేగింపుగా పోలేరమ్మ దేవాలయానికి వెళ్లి అమ్మవారికి నైవేద్యం సమర్పించి మొక్కులు చెల్లించుకోగా గ్రామంలో పండగ వాతావరణం నెలకొంది. ఆలయం వద్ద అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థ ప్రసాదాల వితరణ చేపట్టారు. ఈ కార్యక్రమంలో మాదాసికుర్వ సంఘం నాయకులు చిన్న బీరప్ప బాల్ లింగప్ప శంకరప్ప తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply