ఎస్‌ఐఆర్ ఓటర్ సర్వేకు పూర్తి సహకారం ఇవ్వాలి

కడెం, ఆంధ్రప్రభ: కడెం మండలంలోని అంబారిపేట్ గ్రామంలో నిర్వహిస్తున్న ఎస్‌ఐఆర్ ఓటర్ సర్వేకు గ్రామ ప్రజలందరూ సహకరించాలని అంబారిపేట్ గ్రామ సర్పంచ్ తాళ్లపల్లి రమేష్ (టి రమేష్) కోరారు.

స్థానిక బీఎల్‌ఓ హేమలతతో కలిసి ఇంటింటికీ వెళ్లిన సర్పంచ్, యూత్ కాంగ్రెస్ కడెం మండల అధ్యక్షుడు రెంకల శ్రీనివాస్ యాదవ్, ఉపసర్పంచ్ రెంకాల విజయ్, స్థానిక రేషన్ షాప్ డీలర్ ఎన్ ప్రసాద్ ఓటర్లకు ఎస్‌ఐఆర్ సర్వే ప్రాముఖ్యతను వివరించారు.

ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ అర్హులైన ప్రతి ఓటరు తమ వివరాలను సక్రమంగా నమోదు చేసుకోవాలని, అవసరమైన ధ్రువపత్రాలను స్థానిక బీఎల్‌ఓకు అందజేసి సర్వేను విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేశారు. ఓటరు జాబితాను పారదర్శకంగా, ఖచ్చితంగా రూపొందించేందుకు ఎన్నికల సంఘం చేపట్టిన ఈ కార్యక్రమానికి ప్రతి ఒక్కరూ సహకరించాలని ఆయన సూచించారు.

బీఎల్‌ఓ హేమలత ఎస్‌ఐఆర్ ఫారాలు నింపే విధానం, అవసరమైన ధ్రువపత్రాలపై గ్రామస్తులకు అవగాహన కల్పించారు. గ్రామ ప్రజలు సానుకూలంగా స్పందించి సర్వేకు పూర్తి సహకారం అందిస్తామని తెలిపారు.