డోంగ్లిలో జొన్న కొనుగోలు కేంద్రం ప్రారంభం
డోంగ్లిలో జొన్న కొనుగోలు కేంద్రం ప్రారంభం
డోంగ్లి, ఆంధ్రప్రభ:
జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు కృషితో ప్రభుత్వం జొన్న కొనుగోలుకు అనుమతి ఇచ్చింది. దీనితో డోంగ్లి మండల కేంద్రంలోని సహకార సంఘ ఆవరణలో బుధవారం జొన్న కొనుగోలు కేంద్రాన్ని చైర్మన్ రమేష్ పటేల్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, అధికారులు, రైతులు పాల్గొన్నారు. కొబ్బరికాయ కొట్టి, పూజ చేసి, తూకం వేసి కేంద్రాన్ని లాంఛనంగా ప్రారంభించారు. ఈ కేంద్రం ద్వారా రైతులకు 3,699 మద్దతు ధర లభించి మేలు జరుగుతుందని నాయకులు తెలిపారు.
ఈ కార్యక్రమంలో సహకార సంఘం అధ్యక్షుడు రమేష్ పటేల్, డోంగ్లి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గజానంద్ దేశాయి, ప్రత్యేక అధికారి రమ్యా, సర్పంచ్లు యూనుస్ పటేల్, సంగ్రామ్ పటేల్, బస్వరాజ్ పటేల్, నాయకులు అడ్వకేట్ బస్వరాజ్ పటేల్, విలాస్ పటేల్, ధనంజయ్ పాటిల్, ఓంకార్ పాటిల్, శివారెడ్డి, తహసిల్దార్ రంజిత్, ఏవో శివకుమార్, ఏఈవో గజానంద్, కార్యదర్శి బాబురావ్ పటేల్, ఉప కార్యదర్శి వీరేష్, సిబ్బంది ఇర్వంత్, అంజయ్య తదితరులు పాల్గొన్నారు.
