జవహర్ నగర్ పోలీసుల కీలక సూచనలు..

జవహర్ నగర్ పోలీసుల కీలక సూచనలు..

పని కోసం వచ్చిన వారి పూర్తి వివరాలను తీసుకోండి
మీకు అనుమానం కలిగితే వెంటనే 100కు డయల్ చేయండి లేదా జవహర్ నగర్ పోలీసులకు సమాచారం ఇవ్వండి
సీఐ సైదులు

జవహర్ నగర్, ఆంధ్ర ప్రభ : జవహర్ నగర్ పోలీస్ స్టేషన్ సీఐ సైదులు విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ సిపి ఆదేశానుసారం మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని ప్రజలకు ముఖ్యమైన భద్రతా సూచనలు జారీ చేశారు ఇతర రాష్ట్రాల నుండి ఉపాధి కోసం జవహర్ నగర్‌కు వచ్చే వ్యక్తుల విషయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు కోరుతున్నారు. పని పేరుతో ఎవరు వచ్చినా, వారి పూర్తి వివరాలు సేకరించిన తర్వాతే ఉపాధి కల్పించాలని స్పష్టం చేశారు. పని కోసం వచ్చిన వ్యక్తి పేరు, స్వస్థలం, ఫోన్ నంబర్, ఆధార్ కార్డు వంటి గుర్తింపు పత్రాలను తప్పక తీసుకోవాలి. ఎక్కడి నుంచో వచ్చి “పని చేస్తాం” అని చెప్పే గుర్తు తెలియని వ్యక్తులకు వెంటనే ఇళ్లలో గానీ, షాపుల వద్ద గానీ ఆశ్రయం కల్పించవద్దు.

అనుమానాస్పద వ్యక్తుల సమాచారం ఉంటే వెంటనే జవహర్ నగర్ పోలీస్ స్టేషన్‌కు తెలియజేయాలి. ఇటీవల ఇతర ప్రాంతాల నుండి వచ్చిన కొందరు వ్యక్తులు నేరాలకు పాల్పడిన ఘటనలు వెలుగులోకి వచ్చిన నేపథ్యంలో పోలీసులు ఈ ముందు జాగ్రత్త చర్యలు చేపట్టారు. స్థానికుల భద్రత, శాంతిభద్రతల దృష్ట్యా ఈ సూచనలు ఇచ్చినట్లు సీఐ తెలిపారు. అద్దెకు ఇంటిని ఇచ్చే ముందు పోలీస్ వెరిఫికేషన్ చేయించండి. కొత్తగా పనిలో చేర్చుకునే వారి ఫోటో, ఐడీ ప్రూఫ్ దగ్గర ఉంచుకోండి.అనుమానం వస్తే డయల్ 100 లేదా జవహర్ నగర్ పీఎస్‌కు సమాచారం ఇవ్వండి.పోలీసులు తెలిపినట్లు, ప్రజల సహకారం ఉంటేనే నేరాలను అరికట్టగలం. భద్రత విషయంలో నిర్లక్ష్యం వద్దని సీఐ సైదులు విజ్ఞప్తి చేశారు. ఈ సూచనలను పాటించి మీ కాలనీని సురక్షితంగా ఉంచుకోండి.