ఎలగడపలో పీరీలను దర్శించుకున్న బిఆర్ ఎస్ నేతలు
కడెం, ఆంధ్రప్రభ : కడెం మండలంలోని ఎలగడప గ్రామంలో నిర్వహిస్తున్న మొహర్రం వేడుకల్లో భాగంగా బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకుడు, మాజీ ఎంపీపీ భూక్య అమ్మి బాపూరావు శుక్రవారం పీరీలను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఈ సందర్భంగా బీఆర్ఎస్ ఖానాపూర్ నియోజకవర్గ ఇన్చార్జి భూక్య జాన్సన్ నాయక్ రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో ఖానాపూర్ ఎమ్మెల్యేగా భారీ మెజారిటీతో విజయం సాధించాలని, అలాగే బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ తిరిగి తెలంగాణ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టాలని ఆకాంక్షిస్తూ పీరీలకు 11 కొబ్బరికాయలు కొట్టి, బెల్లం, కట్నం సమర్పించారు.
ఈ సందర్భంగా భూక్య అమ్మి బాపూరావు మాట్లాడుతూ.. భూక్య జాన్సన్ నాయక్ ఖానాపూర్ ఎమ్మెల్యేగా ఎన్నికైతేనే నియోజకవర్గంలో అభివృద్ధి పనులు వేగవంతంగా జరుగుతాయని అన్నారు.
ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ గ్రామ కమిటీ అధ్యక్షుడు ది కొండ రాములు, పార్టీ సీనియర్ నాయకులు, మాజీ ఉపసర్పంచ్ రాపర్తి లక్ష్మణ్, వెంగా వెంక గౌడ్, మేర రాములు, సంధు శ్రీనివాస్, రాపర్తి పెద్ద లక్ష్మణ్, తోడిశెట్టి లక్ష్మిరాజన్, తోడిశెట్టి బాలయ్యతో పాటు పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
