ఉపాధి హామీ కూలీలకు అత్యవసర సరుకులను పంపిణీ

చిట్యాల, ఆంధ్రప్రభ ; గ్రామంలో వేసవి కాలం సందర్భంగా ప్రతి ఒక్కరు ఆరోగ్యం పట్ల పలు జాగ్రత్తలు పాటించాలని సర్పంచ్ ఆవుల సుందర్ తెలిపారు. చిట్యాల మండలంలోని చిన్న కాపర్తి గ్రామంలో సోమవారం సర్పంచ్ సుందర్ ఆధ్వర్యంలో ఉపాధి హామీ కూలీలకు వడ దెబ్బ తగలకుండా ఓఆర్ఎస్ ప్యాకెట్లు, వాటర్ బాటిల్స్, ఫస్ట్ ఎయిడ్ బాక్స్, మొదలగు వాటిని అందజేశారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి శ్రీధర్ రెడ్డి, హెల్త్ అసిస్టెంట్ సరస్వతి, ఉష రాణి తదితరులు పాల్గొన్నారు.
