Kamareddy | శబరిమలలో అన్న ప్రసాదం

Kamareddy | శబరిమలలో అన్న ప్రసాదం
- వితరణ కోసం బియ్యం సేకరణ..
Kamareddy | బిచ్కుంద, ఆంధ్రప్రభ : కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండలం వార్డు సభ్యులు విట్టల్ కత్తి స్వామి, బిజెపి నాయకుడు తోట శంకర్ కన్నె స్వామి లు కలిసి అన్నప్రసాదం వితరణ కోసం బియ్యం సేకరించారు. ఈ సందర్భంగా గ్రామస్తులు పెద్ద ఎత్తున శబరిమలలో జరిగే శ్రీ శాస్త్ర సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో జరిగే అన్న ప్రసాదం వితరణ కార్యక్రమంలో అన్న ప్రసాదం సేవ కోసం బియ్యం ఈ ప్రాంతం నుండి పెద్ద ఎత్తున విరాళాలు అందిస్తున్నందుకు ట్రస్ట్ అధ్యక్షుడు గుడిపాటి చంద్రశేఖర్ శర్మ కృతజ్ఞతలు తెలిపారు. ఇవాళ సాయంత్రం మాజీ ఎంపిటిసి సాయిలుతో పాటు గ్రామస్తులు పెద్ద ఎత్తున అన్న ప్రసాదం వితరణకు సహకరించినందుకు అయ్యప్ప కృపా కటాక్షాలు ఉంటాయని గురుస్వామి అన్నారు.
