ముమ్మరంగా సీడబ్ల్యూఎస్ఎన్ ఎన్రోల్మెంట్ డ్రైవ్

ముమ్మరంగా సీడబ్ల్యూఎస్ఎన్ ఎన్రోల్మెంట్ డ్రైవ్

ఇబ్రహీంపట్నం, ఆంధ్రప్రభ: మండల పరిధిలో సమగ్ర శిక్ష ఆధ్వర్యంలో దివ్యాంగ విద్యార్థులను పాఠశాలలో నమోదు కార్యక్రమం చేపట్టారు. ఈ నెల 2 నుంచి జూన్ 10 వరకు ఎన్రోల్మెంట్ డ్రైవ్ కొనసాగుతోంది. ప్రత్యేక అవసరాల ఉపాధ్యాయిని చంద్రావతి ప్రత్యేక అవసరాలు కలిగిన పిల్లలను గుర్తించి వారి ఇంటికి వెళ్లి తల్లిదండ్రులతో మాట్లాడి పిల్లల పేర్లను పాఠశాలల్లో నమోదు చేస్తున్నారు.

వారికి ప్రభుత్వం నుంచి వచ్చే అలవెన్సులు, ఉపకరణాలు, శస్త్ర చికిత్సలు, సదరం సర్టిఫికెట్లు, యూడీఐడీ కార్డులు, హెల్త్ ఇన్సూరెన్స్ ల గురించి తల్లిదండ్రులకు వివరిస్తున్నారు. గుర్తించిన పిల్లలను దృష్టి పోర్టల్ లో వివరాలు నమోదు చేస్తున్నారు. ఈ ఏడాది కొండపల్లి జడ్పీ బాలికల హైస్కూల్ లో ఆటిజం సెంటర్ ప్రారంభమవుతుందని, ప్రత్యేక ఉపాధ్యాయులు ఉంటారని చంద్రావతి తెలిపారు.