పెంచిన గ్యాస్ సిలిండర్ ధరలను తగ్గించాలని సిపిఐ నిరసన
భూపాలపల్లి, ఆంధ్రప్రభ ; భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ సెంటర్ వద్ద భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ పట్టణ కమిటీ ఆధ్వర్యంలో పెంచిన గ్యాస్ పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గించాలని బుధవారం పెద్ద ఎత్తున నిరసన తెలియజేయడం జరిగింది. ఈ సందర్భంగా సిపిఐ పార్టీ నగర కార్యదర్శి సోత్కు ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ఐదు రాష్ట్రాల ఎన్నికలు అయిపోయాక పేద మధ్యతరగతి ప్రజల పైన పెద్ద ఎత్తున భారం మోపిందని తెలిపారు.
దేశవ్యాప్తంగా ఎన్నడు లేనివిధంగా కమర్షియల్ సిలిండర్ ధర రూ 950 పెంచడం సిగ్గుచేటు అని అన్నారు. కమర్షియల్ సిలిండర్ ధర రూ 3500 చేరుకుందని ఈ భారం పేద ప్రజల పైన పడుతుందని తెలిపారు. పెట్రోల్ డీజిల్ ధరలను అదుపు చేయకుండా కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న వ్యతిరేక విధానాలపైన పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా నిరసన తెలియజేస్తున్నామని తెలిపారు.
సిపిఐ పార్టీ రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లా పట్టణ కేంద్రంలో ఆందోళన పోరాటాలు జరుగుతున్నాయని అన్నారు. వెంటనే నరేంద్ర మోడీ ప్రభుత్వం పెంచిన పెట్రోల్ డీజిల్ గ్యాస్ ధరలు తగ్గించకపోతే దేశవ్యాప్తంగా ఆందోళన చేపడుతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా నాయకులు వేముల శ్రీకాంత్, నేరెళ్ల జోసెఫ్, బూడిద తిరుపతి, తదితరులు పాల్గొన్నారు.
