అంతర్గత రహదారులను పరిశీలించిన మంత్రి వివేక్..
అంతర్గత రహదారులను పరిశీలించిన మంత్రి వివేక్..
చెన్నూర్, ఆంధ్రప్రభ : జిల్లాలోని చెన్నూర్ పట్టణంలో అంతర్గత రహదారుల అభివృద్ధికి ప్రత్యేక చర్యలు తీసుకోవడం జరుగుతందని మంత్రి వివేక్ అన్నారు. సోమవారం నియోజక వర్గ పర్యటనలో భాగంగా చెన్నూర్ పట్టణంలోని పాత బస్టాండ్ నుండి రావిచెట్టు సెంటర్ వరకు చేపట్టిన రహదారి అభివృద్ధి పనులతో పాటు రావిచెట్టు సెంటర్ నుండి చేపట్టిన బైపాస్ రోడ్డు పనులను జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్, చెన్నూర్ మున్సిపల్ కమిషనర్ మురళీకృష్ణ, స్థానిక నాయకులు అధికారులతో కలిసి రాత్రి పరిశీలించారు.
ఈ సందర్భంగా రాష్ట్ర మంత్రి మాట్లాడుతూ.. చెన్నూర్ నియోజకవర్గ పరిధిలో రహదారులు, మురుగు కాలువల అభివృద్ధితో పాటు ప్రజా సంక్షేమ కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుందని తెలిపారు. అనంతరం చెన్నూర్ పట్టణంలోని చెరువు వద్ద గల ఆలయాన్ని సందర్శించి పుష్కర ఏర్పాట్లలో భాగంగా అభివృద్ధి పనులు పరిశీలించారు. ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు, మున్సిపల్ చెర్ పర్సన్ పెద్దింట్టి పద్మ శ్రీనివాస్ కౌన్సిలర్లు ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.
