డ్రైవర్ శంకర్ గౌడ్ కుటుంబానికి ఎమ్మెల్యే దొంతి భరోసా

డ్రైవర్ శంకర్ గౌడ్ కుటుంబానికి ఎమ్మెల్యే దొంతి భరోసా
-రూ. 5 లక్షల ఆర్థిక సాయం, ఇందిరమ్మ ఇల్లు అందజేత
నర్సంపేట, ఆంధ్రప్రభ: ఆర్టీసీ సమ్మె సమయంలో ప్రాణత్యాగం చేసిన డ్రైవర్ కోలా శంకర్ గౌడ్ కుటుంబాన్ని ఆదుకుంటామని ఇచ్చిన మాటను నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి నిలబెట్టుకున్నారు. ఆనాడు శంకర్ గౌడ్ ఆత్మహత్య యావత్ తెలంగాణను కలిచివేసిన నేపథ్యంలో, బాధిత కుటుంబానికి అండగా ఉంటామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. ఈ మేరకు నేడు శంకర్ గౌడ్ కుటుంబానికి 5 లక్షల రూపాయల నగదు మరియు ఇందిరమ్మ ఇల్లు మంజూరు పత్రాన్ని అందజేశారు.
సోమవారం నర్సంపేట పట్టణంలోని ముత్తోజిపేటలో జరిగిన కార్యక్రమంలో ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి సోదరుడు దొంతి అజయ్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. శంకర్ గౌడ్ కుటుంబ సభ్యులను పరామర్శించిన ఆయన, వారికి 5 లక్షల రూపాయల నగదుతో పాటు ఇంటి మంజూరు పత్రాన్ని అప్పగించారు. ప్రభుత్వపరంగా, వ్యక్తిగతంగా ఆ కుటుంబానికి ఎల్లప్పుడూ అండగా ఉంటామని ఈ సందర్భంగా ఆయన భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ అధికారులు మున్సిపల్ కమిషనర్ భాస్కర్, కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేతలు రాష్ట్ర యువ నాయకులు పడిదల నవీన్ రావు, మాజీ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ వేముల సాంబయ్య గౌడ్, కౌన్సిలర్ వీణ విజేందర్ రెడ్డి. పాల్గొన్నారు .
పట్టణ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి బైరి మురళి, కార్యదర్శి నాంపల్లి వెంకటేశ్వర్లు గౌడ్, నల్లబెల్లి మండల వర్కింగ్ ప్రెసిడెంట్ వైనాల అశోక్, నర్సంపేట మండల ఉపాధ్యక్షులు గజ్జి రాజు, మధు, రాజు. నల్లబెల్లి యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు పురుషోత్తం సురేష్, రాము, గాని శ్రీనివాస్, గిరిగాని రమేష్, జిజ్జుల కార్తీక్, ఆర్టీసీ ఉద్యోగులు రూపిక సుమన్, కె. రంగయ్య, మోహన్ తదితరులు పాల్గొని శంకర్ గౌడ్ చేసిన త్యాగాన్ని గుర్తు చేసుకున్నారు. తమ సహోద్యోగి కుటుంబానికి ఎమ్మెల్యే చేస్తున్న సహాయం పట్ల వారు హర్షం వ్యక్తం చేశారు.
