nara lokesh | ఉపాధి కల్పనలో చంద్రబాబు బ్రాండ్

nara lokesh | ఉపాధి కల్పనలో చంద్రబాబు బ్రాండ్
nara lokesh | ఆంధ్రప్రభ, వెబ్‌డెస్క్ : రాయలసీమను రతనాల సీమగా తీర్చిదిద్దడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని మంత్రి నారా లోకేష్ అన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ మొత్తం జమ్మలమడుగు వైపే చూస్తోందని, ఈ ప్రాంతానికి భారీగా పరిశ్రమలు వస్తున్నాయని తెలిపారు.
కడప జిల్లా టి.కోడూరులో సోలార్ ప్లాంట్లను ప్రారంభించిన అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో లోకేశ్ మాట్లాడారు. రాయలసీమలో పారిశ్రామికాభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టిందన్నారు. కొత్త పరిశ్రమలతో యువతకు భారీగా ఉపాధి అవకాశాలు లభిస్తాయని చెప్పారు.
ఉపాధి కల్పన చంద్రబాబు వల్లే సాధ్యమవుతుందని లోకేశ్ పేర్కొన్నారు. ఉపాధి కల్పన మా బ్రాండ్ అయితే.. గొడ్డలి జగన్ బ్రాండ్ అంటూ వైసీపీ అధినేత జగన్‌పై విమర్శలు గుప్పించారు. రాష్ట్ర అభివృద్ధి, పెట్టుబడుల ఆకర్షణలో కూటమి ప్రభుత్వం ముందంజలో ఉందన్నారు.
