ఆలయాల్లో ప్రత్యేక పూజలు..

ఆలయాల్లో ప్రత్యేక పూజలు..
శ్రీ నాగెళ్ల ముత్యాలమ్మ,శ్రీ కనకదుర్గా అమ్మవార్ల తిరునాళ్ళ మహోత్సవంలో పాల్గొన్న తాటి
దమ్మపేట, ( ఆంధ్రప్రభ ) : దమ్మపేట మండలం గండుగులపల్లి గ్రామంలో శ్రీ నాగెళ్ల ముత్యాలమ్మ ,శ్రీ కనకదుర్గా అమ్మవార్ల తిరునాళ్ళ మహోత్సవంలో ఆదివారం బూర్గంపహాడ్,అశ్వారావుపేట మాజీ ఎమ్మెల్యే, తెలంగాణ రాష్ట్ర మాజీ తొలి ట్రైకార్ చైర్మన్, బిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు తాటి వెంకటేశ్వర్లు పాల్గొన్నారు .ఈ సందర్భంగా ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు .అనంతరం ఆలయ కమిటీ “తాటి” ని శాలువాతో సన్మానించారు. ఈ సందర్భంగా తాటి మాట్లాడుతూ నాగెళ్ల ముత్యాలమ్మ, శ్రీ కనకదుర్గా అమ్మవార్ల ఆశీస్సులతో అశ్వారావుపేట నియోజకవర్గ ప్రజలు ఆయురారోగ్యాలతో, సుఖశాంతులతో ఉండాలని కోరుకున్నారు.ఈ కార్యక్రమంలో తుమ్మల శేషుబాబు ,తుమ్మల లక్ష్మణ్ రావు , రమేష్ ,ధనేకుల కృష్ణారావు , కూకలకుంట వెంకటేశ్వర్లు ,గాంధీ ,కూచిపూడి చందర్ రావు ,కుసంపూడి నరేష్ ,తుమ్మల శంకర్ రావు ,ఎర్రా వసంతరావు ,నరకుళ్ల కృష్ణారావు ,తుమ్మల ఉమా , యలమంచి రమణారావు ,పుల్లారావు , ముడుపూడి నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.
