భానుడి ప్రతాపానికి విలవిలలాడుతున్నజనం…

భానుడి ప్రతాపానికి విలవిలలాడుతున్నజనం…

బావులు,చెరువులుఈత కొలనులతో ఉపశమనం.
ఎండలవేడిమికినిర్మానుష్యంగా రహదారులు.

ఊట్కూర్, (ఆంధ్రప్రభ) : భానుడి ప్రతాపానికి ప్రజలు తల్లడిల్లుతున్నారు. రోజురోజుకు పెరుగుతున్న ఎండలవేడిమితో ఉదయం 11 గంటలకే ఎండలు మండుతుండడంతో వృద్ధులు చిన్నారులు ఇళ్ళకే పరిమితమవుతున్నారు. నారాయణపేట జిల్లా ఊట్కూర్ మండలంలో ఆదివారం 42 డిగ్రీల ఉష్ణోగ్రత ఉండడంతో జనం విలవిలలాడారు. ఎండల వేడిమిని తట్టుకోలేక చెట్లుఇండ్లకే పరిమితమవుతున్నారు. వేసవి ప్రతాపానికి సేద తీర్చుకునేందుకు యువకులు చిన్నారులు బావులు చెరువులు ఈత కొలనులవద్ద మధ్యాహ్నం కాస్త ఉపశమనం పొందుతున్నారు. పాఠశాలలకు వేసవి సెలవులతో పాటు ఆదివారం ప్రభుత్వ కార్యాలయాలకు సెలవులు ఉండటంతో ఊట్కూర్ మఠం బావిలో యువకులు, చిన్నారులు ఈతకొట్టేందుకు భారీగా తరలివచ్చి సేద తీర్చుకుంటున్నారు.

ఎండల వేడిమికి మధ్యాహ్నం రహదారులన్నీ నిర్మానుష్యంగా కనిపిస్తున్నాయి. పెళ్లిళ్ల సీజన్ కావడంతో అత్యవసరం అయితే తప్ప ప్రజలు బయటకురావడం లేదు. రోజు రోజుకు పెరుగుతున్న ఎండల వేడిమిని తట్టుకోలేక ప్రజలు తల్లడిల్లుతున్నారు. బాలుడి ప్రతాపానికి ఉపశమనం కలిగేందుకు కొబ్బరి బొండం శీతల పానీయాలు సేవిస్తూ కాస్త ఉపశమనం పొందుతున్నారు. ఉపాధి హామీ పనులకు వెళ్లే కూలీలతోపాటు వివిధ పనులు చేసే కార్మికులు కూలీలు గత వారం రోజులు నుండి ఎండల వేడిమికి తెల్లవారుజామున పనులకు వెళ్లి మధ్యాహ్నం లోపు ఇంటికి తిరిగి వస్తున్నారు. గత పక్షం రోడ్ల నుండి బాలుడి ప్రతాపం తీవ్రవరూపం దాల్చడంతో జనం తల్లడిల్లుతున్నారు.