నోష్ ల్యాబ్ ను వెంటనే తొలగించాలి
నోష్ ల్యాబ్ ను వెంటనే తొలగించాలి
చిట్యాల, ఆంధ్రప్రభ: కార్మికుల ప్రాణాలు తీసే రసాయన నోష్ లాబ్ ను వెంటనే ప్రభుత్వం వెలిమినేడు నుండి తొలగించాలని బిజెపి మండల అధ్యక్షుడు పీక వెంకన్న డిమాండ్ చేశారు. కార్మికులకు రసాయన కంపెనీలో ఎలాంటి రక్షణ లేదని, ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని విధులు నిర్వర్తించాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. గత నెల ఏప్రిల్ 9న ఇదే కంపెనీలో ప్రమాదం జరిగిందని అయినా కూడా రక్షణ చర్యలు తీసుకోకపోవడం యాజమాన్యం నిర్లక్ష్యం కళ్ళకు కట్టినట్టుగా కనబడుతుందన్నారు. వ్యాపారమే ముఖ్యంగా భావిస్తూ కార్మికుల ప్రాణాలు లెక్కచేయకుండా వారితో పని చేయిస్తున్న యాజమాన్యంపై క్రిమినల్ కేసు నమోదు చేయాలన్నారు.
