అంగన్వాడిలో దుస్తుల పంపిణీ

మహబూబ్‌నగర్ రూరల్, ఆంధ్రప్రభ: రామచంద్రాపూర్ అంగన్వాడీ మొదటి కేంద్రంలో చిన్నారులకు ప్రభుత్వం సరఫరా చేసిన దుస్తులను గ్రామ సర్పంచ్ వై. నర్సిములు (బాబురావు) బుధవారం పంపిణీ చేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గతంలో ఎన్నడూ లేని విధంగా చిన్నారుల కోసం వినూత్న పథకాలు, కార్యక్రమాలు అమలు చేస్తూ వారిని అంగన్వాడీ కేంద్రాలకు ఆకర్షించేలా ప్రభుత్వం చర్యలు చేపట్టడం అభినందనీయమని అన్నారు. చిన్నారుల సంక్షేమం, విద్యాభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తున్న ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డికి ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ కార్యకర్త పి. శోభారాణి, చిన్నారుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.