Yadagirigutta లక్ష్మీ నరసింహ స్వామి వారిని దర్శించుకున్న మిస్ యూనివర్స్

యాదగిరిగుట్ట, : మిస్ యూనివర్స్ విక్టోరియా క్జేర్ థీల్విగ్ యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహ స్వామి వారిని మంగ‌ళ‌వారం ద‌ర్శించుకున్నారు. పూజారులు ఆశీర్వచ‌నం అందించారు.

దర్శనం తర్వాత విక్టోరియా క్జేర్ థీల్విగ్‌కు స్వామివారి చిత్ర‌ప‌టం, ప్రసాదం అందజేశారు. సందర్శన సమయంలో ఆమె ఆలయ ప్రాముఖ్యత, సంప్రదాయాలు, చారిత్రక నేపథ్యం గురించి అడిగి తెలుసుకున్నారు. ఆలయ ప్రాముఖ్యత గురించి ఆలయ కార్యనిర్వాహక అధికారి భాస్కర్ రావు ఆమెకు వివ‌రించారు.విక్టోరియా క్జేర్ థీల్విగ్ కూడా అఖండ దీపారాధనలో పాల్గొన్నారు. సందర్శ‌కుల పుస్త‌కంలో తన భావాలను వ్యక్తపరుస్తూ, ఈ అనుభవాన్ని “వర్ణించలేనిది” ఆమె అభివర్ణించారు.

Leave a Reply