tendulkar| ఘ‌నంగా స‌చిన్ కొడుకు పెళ్లి

tendulkar| ఘ‌నంగా స‌చిన్ కొడుకు పెళ్లి

  • సానియాతో ఏడ‌డుగులు వేసిన అర్జున్‌
  • వీడియోలు సోషల్ మీడియాలో వైరల్
  • ముకేశ్ అంబానీ ఫ్యామిలీ ఆధ్వ‌ర్యంలో పార్టీ

ఆంధ్ర‌ప్ర‌భ వెబ్‌డెస్క్ : మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండుల్కర్ ఇంట పెళ్లి బాజాలు మోగాయి. సచిన్‌, అంజలి దంపతుల కుమారుడు, క్రికెటర్ అర్జున్ టెండుల్కర్ పెళ్లి యువ వ్యాపారవేత్త సానియా చందోక్ తో ఇవాళ జరిగింది. ముంబైలో వివాహ వేడుక జ‌రిగింది. ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కాగా గతేడాది ఆగష్టులో అర్జున్-– సానియా ఎంగేజ్మెంట్ జరిగిన విషయం తెలిసిందే. అత్యంత సన్నిహితుల మధ్య రహస్యంగా ఈ వేడుక జరుగగా.. కొన్నిరోజుల తర్వాత సచిన్ టెండుల్కర్ ఈ విషయాన్ని ధ్రువీకరించాడు. అయితే ఇటీవల అర్జున్–- సానియా ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ కూడా ఘనంగా జరిగాయి. ఇక ముకేశ్ అంబానీ ఫ్యామిలీ జామ్ నగర్ లో కాబోయే వధూవరుల కోసం పార్టీ ఏర్పాటు చేయగా, అనంత్ అంబానీ – రాధికా మర్చంట్ పెళ్లి జరిగిన ప్రదేశంలోనే అర్జున్–- సానియాల వివాహ వేడుకలను స్టార్ట్ చేశారు.

Leave a Reply