కలమడుగులో రామయజ్ఞం

కలమడుగులో రామయజ్ఞం

జన్నారం,ఆంధ్రప్రభ: మంచిర్యాల జిల్లా జన్నారం మండలంలోని కలమడుగు గ్రామ సమీపంలో ఉన్న శ్రీ నరనారాయణ స్వామి ఆలయంలో 103 మంది ఆంజనేయ భక్తులచే కన్నుల పండుగగా రామయజ్ఞం మంగళవారం నిర్వహించారు. ముందగా ఆలయ కమిటీ పూజారి రాజానరేంద్ర శర్మ ఆధ్వర్యంలో ఆంజనేయస్వామికి అభిషేకం ,పూజలు చేశారు. అనంతరం భక్తుల రామ నామ స్మరణ మధ్య రామయజ్ఞం నిర్వహించారు. ఆలయ కమిటిచే అన్నదాన కార్యక్రమం చేశారు.ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచి బొంతల నాగమణి- మల్లేష్, ఆలయ కమిటి చైర్మన్ స్వదేశ్ కుమార్, గ్రామ పెద్దలు గౌరయ్య, విష్ణు, భక్తులు పాల్గొన్నారు.