సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని దర్శించుకున్న మంత్రి
సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని దర్శించుకున్న మంత్రి
మోపిదేవి – ఆంధ్రప్రభ : మోపిదేవిలోని శ్రీవల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని సోమవారం ఉదయం రాష్ట్ర గనుల శాఖ మంత్రి కొల్లు రవీంద్ర దర్శించుకున్నారు. తొలుత నాగ పుట్టలో పాలు పోసి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఆలయ అర్చకులు ఆయనకు ఘన స్వాగతం పలుకగా, స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ ఈవో దాసరి శ్రీరామ వరప్రసాదరావు స్వామివారి చిత్రపటం ప్రసాదాలను ఆయనకి అందించారు. కార్యక్రమంలో టిడిపి నాయకులు పాల్గొన్నారు.
