Temple | 18వ మహా పడిపూజ…

Temple | 18వ మహా పడిపూజ…

Temple | ములుగు సిద్దిపేట జిల్లా, ఆంధ్రప్రభ : వంటిమామిడి లక్ష్మణ్ గౌడ్ గురు స్వామి ఆధ్వర్యంలో నిర్వహించిన హరిహర పుత్రుని సన్నిధానంలో 18వ మహా పడిపూజ కార్యక్రమం ఈ రోజు ఘనంగా నిర్వహించారు. లక్ష్మణ్ గౌడ్(Laxman Goud) గురు స్వామి మూడు సార్లు వంటిమామిడి నుండి శబరిమల అయ్యప్ప సన్నిధి వరకు పాదయాత్రతో వెళ్లి వచ్చాడు.

ఇప్పుడు వేసినమాలతో 18 సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంగా మహా పడిపూజ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మహా పడిపూజ(Padipuja) కార్యక్రమానికి భారీ సంఖ్యలో హాజరై పూజ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. మురళి పంతులు గురు స్వామి సమక్షంలో హరిహర పుత్రునికి పంచామృతాలతో అభిషేకాలు(Abhishekal) చేసి స్వామిని పదునెట్టంబడి గుండా సన్నిధానంలో ప్రతిష్టించారు.

ముందుగా విగ్నేశ్వరునికి, అయ్యప్ప స్వామికి, సుబ్రహ్మణ్యేశ్వరుడికి పూజలు నిర్వహించిన అనంతరం పడిపూజ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. అనంతరం పంచపక్ష పరమాన్నాలతో స్వామికి నైవేద్యం సమర్పించారు. అయ్యప్ప స్వామి భక్తి గీతాలతో నృత్యాలు చేయగా భక్తులు స్వామి వారి భజనలు చేస్తూ పారవశ్యంలో మునిగిపోయారు. అనంతరం మహా పడిపూజ తిలకించడానికి వచ్చిన అయ్యప్ప లకు, భక్తులకు తీర్థ ప్రసాదాలతో పాటు అన్న ప్రసాదాన్ని అందజేశారు.