Market | ఈ రోజు రేటు ఎంతంటే?

Market | ఈ రోజు రేటు ఎంతంటే?

Market | ఆంధ్ర‌ప్ర‌భ వెబ్‌డెస్క్ : మాంసం ప్రియులకు చికెన్ ధ‌ర‌లు షాకిస్తున్నాయి. వేస‌విలో ధ‌ర‌లు పైపైకి పోతున్నాయి. విపరీతమైన ఎండల వల్ల కోళ్ల బరువు తగ్గడం మరియు మరణాల శాతం పెరగడంతో సరఫరా త‌గ్గ‌డంతో రేట్లు క్ర‌మంగా పెరుగుతున్నాయి. గ‌త వారం కంటే ఈ వీక్ ధ‌ర పెరిగింది. గ‌త వారంతో పోలిస్తే ఈ వీక్ కిలో చికెన్ ధ‌ర పది నుంచి ఇరవై రూపాయలు పెరిగింది.

ఏప్రిల్ 19, 2026 నాటికి హైదరాబాద్‌లో చికెన్ ధరలు గరిష్ట స్థాయిలో ఉన్నాయి. స్కిన్ చికెన్ కిలో రూ. 235-250, స్కిన్‌లెస్ చికెన్ రూ. 267-280 మధ్య, లైవ్ చికెన్ దాదాపు రూ. 220కి పైగా అమ్ముడవుతోంది..

హైద‌రాబాద్‌లో తాజా ధరలు (సుమారుగా):
స్కిన్ చికెన్ (కిలో): ₹235 – ₹250
స్కిన్‌లెస్ (కిలో) : ₹267 – ₹280
లైవ్ చికెన్ (కిలో): ₹220
బోన్‌లెస్ (కిలో): ₹280 – ₹320

Leave a Reply