Vijay, Rashmika | స్వగ్రామంలో వివాహ రిసెప్షన్, వ్రతం

Vijay, Rashmika | స్వగ్రామంలో వివాహ రిసెప్షన్, వ్రతం

Vijay, Rashmika | అచ్చంపేట, ఆంధ్రప్రభ : ప్రముఖ తెలుగు సినీ హీరో విజయ్ దేవరకొండ – హీరోయిన్ రష్మిక మందన వివాహ రిసెప్షన్, సత్యనారాయణ స్వామి వేడుకలు ఆయన స్వగ్రామమైన నాగర్‌కర్నూల్ జిల్లా, బల్మూర్ మండలం, తుమ్మాన్‌పేటలో ఘనంగా నిర్వహించారు. స్వగృహంలో బంధువులు, రాజకీయ నాయకులు, అభిమానులు, గ్రామస్తుల సమక్షంలో ఈ వేడుకలు ఉత్సాహంగా సాగాయి. సాధారణంగా సెలబ్రిటీ వివాహ వేడుకలు నగరాలకు పరిమితమవుతుండగా, విజయ్ దేవరకొండ స్వగ్రామంలో వేడుకలు జరపడం గ్రామానికి ప్రత్యేక గుర్తింపును తీసుకొచ్చింది. దీంతో తుమ్మాన్‌పేట పరిసర ప్రాంతాలు శోభాయమానంగా మారాయి.

ఈ వేడుకలకు నాగర్‌కర్నూల్ జిల్లా కలెక్టర్ బదవత్ సంతోష్ నాయక్ దంపతులు హాజరై వధూవరులను ఆశీర్వదించారు. అధికార యంత్రాంగం పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేపట్టారు. సినీ ప్రముఖుడైన విజయ్ దేవరకొండ తన మూలాలను మరిచిపోకుండా స్వగ్రామంలో పెళ్లి వేడుకలు జరపడం సామాజికంగా సానుకూల సందేశంగా మారింది. గ్రామీణ ప్రాంతాలకూ ప్రాధాన్యం ఇచ్చే దృక్పథం యువతకు ఆదర్శంగా నిలుస్తోంది. సెలబ్రిటీ స్థాయి ఉన్నప్పటికీ, సంప్రదాయబద్ధంగా స్వగ్రామంలో సత్యనారాయణ స్వామి వ్రతం, రిసెప్షన్ నిర్వహించడం, ఇక మరోవైపు, ఈ వేడుకలతో తుమ్మాన్‌పేట గ్రామం ఒక్కరోజులోనే రాష్ట్రవ్యాప్తంగా గుర్తింపు పొందింది. మొత్తంగా ఈ వివాహ వేడుకలు వ్యక్తిగత ఆనందాన్ని మించిన సామాజిక ఉత్సవంగా మారి, గ్రామానికి పండుగ వాతావరణాన్ని తీసుకొచ్చాయి.

Leave a Reply