Telangana Public Govt | గ్రామాభివృద్ధికి పాటుపడదాం..

Telangana Public Govt | గ్రామాభివృద్ధికి పాటుపడదాం..

  • గ్రామ అభివృద్ధి అధికార పార్టీతో సాధ్యం
  • నారక్కపేట గ్రామ ప్రజల ఆశీస్సులతో

Telangana Public Govt | నల్లబెల్లి, ఆంధ్రప్రభ : అధికార కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను.. నన్ను దీవించి.. నా గుర్తు బ్యాటుకు ఓటు వేసి గెలిపించగలరని దండెం రవీందర్ వేడుకుంటున్నారు. తెలంగాణ ప్రజా ప్రభుత్వం(Telangana Public Govt), ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, నర్సంపేట శాసనసభ్యులు దొంతి మాధవ రెడ్డి సహాయ సహకారంతో మన గ్రామాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తాను, రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నది.

నేను అధికార కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా సర్పంచ్ గా పోటీ చేస్తున్నాను.. గ్రామంలో పేరుకుపోయిన సమస్యలను ఎమ్మెల్యే, ప్రభుత్వ అధికారుల సహకారంతో పరిష్కారానికి కృషి చేస్తానన్నారు.

ప్రభుత్వం, శాసనసభ్యులు దొంతి మాధవ రెడ్డి సహకారంతో గ్రామంలో రామాలయం గుడి నిర్మాణానికి కృషి చేస్తానన్నారు. గ్రామంలో సైడ్ కాలువలు, సీసీ రోడ్ల(CC roads) నిర్మాణాన్ని పూర్తి చేస్తానన్నారు. నూతన గ్రామపంచాయతీ భవనాన్ని నిర్మాణం చేపడతాం.. విద్యార్థులకు అధునాతన‌ విద్య కోసం గ్రామంలో గ్రంథాలయం ఏర్పాటు చేస్తానన్నారు.

గ్రామంలోని మహిళా సంఘం గ్రూప్ సభ్యురాలు అందరికీ వడ్డీలేని రుణాలను ఇప్పించే ప్రయత్నం చేస్తానన్నారు. ప్రభుత్వ అధికారులు గ్రామ ప్రజల సహకారంతో మహిళలు బతుకమ్మ ఆడుకోవడానికి స్థలాన్ని ఏర్పాటు చేపిస్తామ‌న్నారు.

గ్రామంలో ప్రతి ముఖ్యమైన కూడలిలో సెంట్రల్ లైటింగ్(central lighting) ఏర్పాటు, ఇల్లు లేని నిరుపేదలందరికీ ఎమ్మెల్యే సహకారంతో ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేస్తామన్నారు. రేషన్ కార్డు లేని ప్రతి ఒక్కరికికీ మంజూరు చేపిస్తామ‌న్నారు. అర్హత కలిగిన నిరుపేదలకు అంత్యోదయ కార్డులు ఇప్పిస్తామన్నారు.

అభివృద్ధి అధికార పార్టీతోనే సాధ్యమ‌ని, ప్రజలందరికీ ప్రభుత్వం ద్వారా వచ్చే సంక్షేమ పథకాలన్నింటిని రాజకీయాలకతీతంగా మాధవ రెడ్డి సహకారంతో ప్రతి ఒక్కరికి అందిస్తామ‌న్నారు. కావున అధికార కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అయిన త‌న‌ను, వార్డు సభ్యుల అభ్యర్థులను అధిక మెజార్టీతో గెలిపించగలరని కోరారు.

Leave a Reply