నేల కూలిన తెలంగాణ సాహితీ శిఖరం

నేల కూలిన తెలంగాణ సాహితీ శిఖరం
నర్సంపేట, ఆంధ్రప్రభ : తెలంగాణ సాహితీ శిఖరం నేల కూలిందని టీజేఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు అంబటి శ్రీనివాస్ అన్నారు. ప్రముఖ కవి రచయిత అందెశ్రీ మృతి పట్ల తెలంగాణ జన సమితి పార్టీ వరంగల్ జిల్లా(Warangal District) కమిటీ అందె శ్రీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించి, కుటుంబానికి ప్రగాఢ సంతాపాన్ని తెలిపారు.
ఈ సందర్భంగా తెలంగాణ జన సమితి పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు అంబటి శ్రీనివాస్(Ambati Srinivas), వరంగల్ జిల్లా అధ్యక్షుడు షేక్ జావిద్ మాట్లాడుతూ.. ప్రత్యేక ఉద్యమంలో తన మాట, పాటలతో అందెశ్రీ చేసిన కృషి మరువలేనిదని అన్నారు. మనిషిలో మానవత్వం కరువైపోయిందన్న గొప్ప కవి అందెశ్రీ(Kavi Andesri) అని కొనియాడారు. అందేశ్రీ రాసిన జయ జయహే తెలంగాణ గీతం రాష్ట్ర గీతంగా ప్రభుత్వం ఎన్నిక చేయడం ఆయనలో ఉన్న గొప్పతనం ఏమిటో తెలిసిపోయిందన్నారు.
రాష్ట్రంలోని కవులను, గాయకులను సాహితి లోకాన్ని వదిలి ఆకస్మికంగా అందెశ్రీ వెళ్ళిపోవడం బాధాకరం అన్నారు. అందె శ్రీ కుటుంబానికి తమ పార్టీ తరఫున ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో వరంగల్ జిల్లా అధ్యక్షుడు షేక్ జావిద్(Sheikh Javid), రాష్ట్ర నాయకులు గుంటి రామచందర్, బోనగాని రవీందర్, సోల్తి సాయికుమార్, మహమ్మద్ సందాని పాల్గొన్నారు.
