Telanganaలో బీజేపీతోనే స్వ‌ర్ణ‌యుగం సాధ్యం – కమలం స్టేట్ చీఫ్ రామచంద్రరావు

హైదరాబాద్​ , ఆంధ్ర‌ప్రభ : బీజేపీ (BJP ) ప్ర‌భుత్వం మాత్ర‌మే తెలంగాణ‌లో (telangana ) స్వ‌ర్ణ‌యుగం (golden era ) తెస్తుంద‌ని, తెలంగాణలో బీజేపీ అధికారంలోకి తీసుకువచ్చేందుకు కార్యకర్తలు విజయ సంకల్పం తీసుకోవాలని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు (TBJP ramachandrarao ) పిలుపునిచ్చారు. ఉమ్మడి నల్గొండ జిల్లా చౌటుప్పల్ కు (choutuppal ) వచ్చిన ఆయనకు పార్టీ శ్రేణులు ఘనంగా స్వాగతం పలికాయి. అనంతరం నిర్వహించిన సన్మాన సభలో ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలను అవలంబిస్తోందని విమర్శించారు. రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని, విద్యార్థులు రీయింబ‌ర్స్‌మెంట్‌ విడుదల కాక ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. కాంగ్రెస్ ను ఎందుకు ఎన్నుకున్నామని ప్రజలు బాధ‌పడుతున్నారని చెప్పారు.

డ‌బుల్ ఇంజిన్ స‌ర్కార్‌తో అభివృద్ధి సాధ్యం
డబుల్ ఇంజిన్ స‌ర్కార్‌తో తెలంగాణ అన్ని విధాలుగా అభివృద్ధి చెందుతుంద‌ని రామ‌చంద‌ర్ అన్నారు. గ‌త బీఆర్ఎస్ ప్ర‌భుత్వం అవినీతిమయమైంద‌న్నారు. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయకుండా ప్రజల‌ను ఇబ్బందులు పెడుతోంద‌న్నారు. తెలంగాణ ప్రజలు ఈ రెండు పార్టీలకు ప్రత్యామ్నాయంగా బీజేపీ వైపు చూస్తున్నార‌న్నారు.

Leave a Reply