బెజ్జంకిలో ఘనంగా తెలంగాణ అవతరణ దినోత్సవ వేడుకలు..
బెజ్జంకి, ఆంధ్రప్రభ : తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని మండలంలోని అన్ని ప్రభుత్వం ప్రైవేట్ కార్యాలయాల్లో వేడుకలు అత్యంత ఘనంగా నిర్వహించబడ్డాయి. ఈ సందర్భంగా పోలీస్ స్టేషన్ ప్రాంగణంలో ఎస్ఐ తోట తిరుపతి, మండల పరిషత్ కార్యాలయంలో ఎంపిడిఓ ప్రవీణ్, తహసీల్దార్ కార్యాలయంలో ఎమ్మార్వో శ్రీకాంత్, గ్రామ పంచాయితీ ఆవరణలో సర్పంచ్ బొల్లం శ్రీధర్ జాతీయ పతాకాన్ని ఎగురవేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు.
ఈ సందర్బంగా తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం కోసం పోరాడిన మహనీయుల త్యాగాలను స్మరించుకుంటూ, వారి ఆశయాలను కొనసాగించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని నాయకులు పేర్కొన్నారు. దేశభక్తి నినాదాలతో గ్రామం మారుమోగింది. తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి పథంలో ముందుకు సాగాలని, ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందించేందుకు అధికారులు, నాయకులు కట్టుబడి ఉంటారని పేర్కొన్నారు.
