Telangana | బాస‌ర‌కు మ‌హ‌ర్ద‌శ‌

Telangana | బాస‌ర‌కు మ‌హ‌ర్ద‌శ‌

ఆల‌య అభివృద్ధి ప‌నుల‌కు సీఎం శంకుస్థాప‌న‌

Telangana | బాసర (నిర్మల్ జిల్లా), ఆంధ్ర‌ప్ర‌భ : నిర్మల్ జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన బాసర శ్రీ జ్ఞాన సరస్వతి దేవి అమ్మవారి పునర్నిర్మాణానికి సోమవారం రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, మంత్రులు భూమి పూజ కార్యక్రమంలో పాల్గొన్నారు. 225 కోట్ల రూపాయలతో చేపట్టి అభివృద్ధి పనులకు సీఎం రేవంత్ రెడ్డి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, జిల్లా ఇంచార్జ్ మంత్రి జూపల్లి కృష్ణారావు రాష్ట్ర దేవదాయ శాఖ మంత్రి కొండా సురేఖ, ఎమ్మెల్యే రామారావు పటేల్, తదితరులు శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీ నగేష్, ఖానాపూర్ ఎమ్మెల్యే డి జిల్లా డిసిసి అధ్యక్షుడు వెడ్మా బొజ్జు,రాష్ట్ర పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, రాజ్యసభ సభ్యులు వేం నరేందర్ రెడ్డి, రాష్ట్ర దేవదాయ శాఖ కమిషనర్ హన్మంత్ రావు, జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ సర్పంచ్ వెంకటేష్ గౌడ్, తదితరులు పాల్గొన్నారు.

రూ.225 కోట్ల‌తో బాస‌ర ఆల‌య పునః నిర్మాణం చేప‌ట్ట‌నున్నారు. తొమ్మిది అంత‌స్థుల రాజ‌గోపురం, ఈశాన్యంలో కోనేరు నిర్మాణం చేయ‌నున్నారు. మూడు రెట్లు పెర‌గ‌నున్న బాస‌ర దేవాల‌య విస్తీర్ణం. శృంగేరి పీఠాధిపతుల అనుమ‌తితో ఆల‌య అభివృద్ధి ప‌నులు చేప‌ట్టారు. ఇప్ప‌టికే బాస‌ర ఆల‌య మాస్ట‌ర్ ప్లాన్ రూప‌క‌ల్ప‌న చేశారు. ప్ర‌స్తుతం 2వేల చ‌ద‌ర‌పు అడుగుల్లో గ‌ర్భాల‌యం ఉంది.

Telangana