విద్యార్థుల ఉజ్వల భవిష్యత్తుకు ప్రభుత్వం అధిక ప్రాధాన్యత

విద్యార్థుల ఉజ్వల భవిష్యత్తుకు ప్రభుత్వం అధిక ప్రాధాన్యత

ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు అండగా ప్రభుత్వం
ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్యా బోధన
ప్రభుత్వపాఠశాలల్లో విద్యార్థులు అత్యుత్తమ ఫలితాలు సాధించారు
44 మంది విద్యార్థులకు ఆత్మీయ సన్మానం
ఎమ్మెల్యే శ్రీరాం రాజగోపాల్ తాతయ్య

జగ్గయ్యపేట, ఆంధ్రప్రభ : ప్రభుత్వ పాఠశాలలో చదివే పదవ తరగతి విద్యార్థులు అత్యుత్తమ ఫలితాలు సాధించి రికార్డులు నెలకొల్పారని ఎమ్మెల్యే శ్రీరాం రాజగోపాల్ తాతయ్య అన్నారు. మంగళవారం ఎమ్మెల్యే తాతయ్య నివాస ఆవరణలో పదవ తరగతి పరీక్షా ఫలితాలలో అత్యధిక మార్కులు సాధించిన 44 మంది విద్యార్థులను అభినందించారు. ఈ సందర్భంగా వారికి శాలువాలతో ఆత్మీయ సన్మానం నిర్వహించి ప్రత్యేక మెమొంటోలు ఎమ్మెల్యే తాతయ్య అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే తాతయ్య మాట్లాడుతూ విద్యార్థుల ఉజ్వల భవిష్యత్తుకు కూటమి ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తున్నట్లు వివరించారు.

ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు నాణ్యమైన విద్యాబోధన మౌలిక సదుపాయాల కల్పన వంటి విషయంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ పలు కీలక నిర్ణయాలు తీసుకుని విద్యార్థుల బంగారు భవిష్యత్తు కోసం ముందుకు వెళ్తున్నట్లు వివరించారు. మెగా డీఎస్సీ ద్వారా 16 వేల టీచర్ పోస్టులు భర్తీ చేయడం ద్వారా పాఠశాలల్లో ఉపాధ్యాయుల కొరత లేకుండా విద్యార్థులకు అత్యుత్తమమైన విద్యను అందించడం సాధ్యమైందని అన్నారు.

ప్రవేట్ పాఠశాలల్లో విద్యార్థులతో పోటీపడుతూ ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు అత్యుత్తమ ఫలితాలు సాధించారని వారిని అభినందిస్తున్నట్లు పేర్కొన్నారు. విద్యార్థులకు విద్యతో పాటు నాణ్యమైన ఆహారం ,మెరుగైన యూనిఫామ్ పుస్తకాలు, వారికి ఆసక్తి ఉన్న క్రీడల్లో రాణించే విధంగా మంచి తర్ఫీదు ఇస్తూ ప్రభుత్వ పాఠశాలలు రాష్ట్రంలో ఆదర్శంగా నిలుస్తున్నట్లు పేర్కొన్నారు. ప్రత్యేకంగా వంద రోజుల ప్రణాళిక విద్యార్థులలో చదువు పట్ల ఆసక్తి పెంచి మంచి ఫలితాలు సాధించేందుకు ఉపయోగపడ్డట్టు తెలిపారు. చదువులో మంచి ప్రతిభ చూపుతూ ఉన్న విద్యార్థులకు ప్రభుత్వం అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందించడం జరుగుతున్నట్లు తెలిపారు.

మాజీ మున్సిపల్ చైర్మన్ శ్రీరాం సుబ్బారావు మాట్లాడుతూ ఒకే వేదికగా పదవ తరగతి పరీక్షా ఫలితాలలో 550 మార్కులకు పైగా సాధించిన 44 మంది విద్యార్థుల కు ఆత్మీయ సన్మానం చేసుకోవటం సంతోషదాయకంగా ఉందన్నారు. జగ్గయ్యపేట వ్యవసాయ మార్కెట్ యార్డ్ చైర్మన్ మల్లెల సీతమ్మ మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాల లలో గతంలో ఎన్నడు లేని విధంగా మౌలిక సదుపాయాల కల్పన ప్రభుత్వం చేయటం జరిగిందన్నారు.

ఈ సందర్భంగా విద్యార్థులతో కలిసి ఎమ్మెల్యే తాతయ్య, మాజీ మున్సిపల్ చైర్మన్ సుబ్బారావు, ఏఎంసీ చైర్మన్ మల్లెల సీతమ్మ,విద్యాశాఖ అధికారులు, టీచర్లు అల్పాహారాన్ని స్వీకరించారు. ఈ కార్యక్రమంలో మూడు మండలాల ఎంఈఓ లు పాఠశాలల ప్రధానోపాధ్యాయులు పట్టణ ప్రముఖులు పాల్గొన్నారు.

Leave a Reply