డిజిటల్ రంగంలోకి అడుగుపెడుతున్న తరుణంలో టీడీపీ మహానాడు

డిజిటల్ రంగంలోకి అడుగుపెడుతున్న తరుణంలో టీడీపీ మహానాడు
సెంట్రల్ మహానాడు 11 క్లస్టర్లలో నిర్వహణ..
క్లస్టర్-3 ఆధ్వర్యంలో వర్చువల్ మహానాడు
పాయకాపురం, ఆంధ్రప్రభ : రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు సెంట్రల్ మహానాడు అత్యంత వైభవంగా నిర్వహించారు. స్థానిక 59, 64వ డివిజన్లకు చెందిన మహానాడు కార్యక్రమం సింగ్‌నగర్ ప్రాంతంలోని గుజ్జల సరళాదేవి హాలులో జరిగింది.
ఈ కార్యక్రమంలో ఎంపీ కేశినేని శివనాథ్, సెంట్రల్ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు పాల్గొని తెలుగుదేశం పార్టీ జెండాను ఆవిష్కరించారు. అనంతరం స్వర్గీయ నందమూరి తారక రామారావు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. తర్వాత వర్చువల్ మహానాడును ప్రారంభించారు.
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపు మేరకు, ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాల ప్రకారం, పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు నారా లోకేష్ నాయకత్వంలో మహానాడు నిర్వహిస్తున్నట్లు నాయకులు తెలిపారు. సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్లు అన్న సిద్ధాంతంతో తెలుగుదేశం పార్టీ పనిచేస్తోందని పేర్కొన్నారు.
‘స్త్రీ శక్తి’ అనే ప్రధాన నినాదంతో మహానాడు వేదికగా మారిందని నాయకులు అన్నారు. డిజిటల్ రంగంలోకి అడుగుపెడుతున్న తరుణంలో వర్చువల్ విధానంలో మహానాడు నిర్వహించడం ప్రత్యేకతగా నిలిచిందని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో డివిజన్ టీడీపీ అధ్యక్షుడు కె. రవికుమార్, బంగారు నాయుడు, క్లస్టర్ ఇన్‌చార్జి వింజమూరి సతీష్, మరకా శ్రీనివాసరావు, ప్రధాన కార్యదర్శి బుదాల సురేష్, ఎస్.కే. బాబు, ఇన్‌చార్జి జాన్ వలి, డివిజన్ టీడీపీ కమిటీ సభ్యులు, నాయకులు, కార్యకర్తలు, మహిళా నాయకులు, యువత, అనుబంధ సంఘాల కమిటీ సభ్యులు పాల్గొన్నారు.
