కొండపల్లి బొమ్మల పండుగకు మంత్రి దుర్గేష్

కొండపల్లి బొమ్మల పండుగకు మంత్రి దుర్గేష్
ఇబ్రహీంపట్నం, ఆంధ్రప్రభ : కొండపల్లి బొమ్మల పండగలో భాగంగా రెండో రోజు ఆదివారం జరిగే కార్యక్రమానికి రాష్ట్ర పర్యాటక, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ హాజరు కానున్నట్లు మున్సిపల్ చైర్మన్, టీడీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి చెన్నుబోయిన చిట్టిబాబు తెలిపారు. ఆయనతో పాటు ఎంపీ కేశినేని శివనాథ్ (చిన్ని), మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్, కలెక్టర్ జి.లక్ష్మీశ హాజరవుతారని చెప్పారు. పండుగలో భాగంగా జరిగే కార్నివాల్ లో 250 మంది కళాకారులతో పురవీధుల్లో భారీ ఊరేగింపు ఉంటుందన్నారు. కొండపల్లి బొమ్మల శకటంపై మంత్రి, ఎంపీ, ఎమ్మెల్యే, కలెక్టర్ పర్యటిస్తారన్నారు. ఈ కార్యక్రమానికి ప్రజలు వేలాదిగా హాజరై జయప్రదం చేయాలని చైర్మన్, నిర్వాహక కమిటీ సభ్యులు విజ్ఞప్తి చేశారు.
కొండపల్లి బొమ్మల పండగలో నేటి (రెండోరోజు) కార్యక్రమాలు
ఉదయం 10 గంటలకు బొమ్మల దర్బార్ – బొమ్మల ప్రదర్శన, బొమ్మల కొలువు, ఉదయం 11 గంటలకు కొండపల్లి బొమ్మల ఉత్పత్తి, కళాకారులకు తెల్లపొనిక చెట్టు వనరులను అందించడం – పాలసీ దృక్కోణం – అటవీ శాఖ చర్చ, మధ్యాహ్నం 12 గంటలకు “విమెన్ ఫ్రం బ్యాక్ రూమ్స్ టు బోర్డు రూమ్స్” చర్చ, సాయంత్రం 4 గంటలకు కొండపల్లి కార్నివాల్, జానపద ప్రదర్శనలు, కళాకారుల ఊరేగింపు, సాయంత్రం 6 గంటలకు సాంస్కృతిక కార్యక్రమాలు, కీలు బొమ్మలు, తోలు బొమ్మల ప్రదర్శనలు ఉంటాయి.

