పేకాట స్థావరంపై టాస్క్ ఫోర్స్ పోలీసుల దాడి
పేకాట స్థావరంపై టాస్క్ ఫోర్స్ పోలీసుల దాడి
హన్మకొండ క్రైమ్, ఆంధ్ర ప్రభ : సుబేదారి పోలీస్ స్టేషన్ పరిధిలో మంగళవారం రాత్రి పేకాట స్థావరం పై టాస్క్ ఫోర్స్ ఏసిపి మధుసూదన్ ఆధ్వర్యంలో టాస్క్ ఫోర్స్ పోలీసులు దాడి చేసి పేకాట ఆడుతున్న పదిమందిని అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుండి 27,810 నగదుతో పాటు, తొమ్మిది మొబైల్ ఫోన్లు, ప్లేయింగ్ కార్డ్స్ స్వాధీనం చేసుకొని వారిని సుబేధారి పోలీసులకు అప్పగించినట్లు ఏ. సి. పి మధుసుధన్ తెలిపారు.
